వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలు జతకట్టేయత్నాలు ఊపందుకున్నాయి. విపక్ష కూటమిని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో బీహార్ CM నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలతో సమావేశమవుతున్నారు. కర్ణాటక CMప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై విపక్ష నేతలు తమ ఐక్యతను పరోక్షంగానే సూచించాయి. త్వరలోనే ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.