వ్యభిచారంపై ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిబంధనల ప్రకారం వ్యభిచారం చేయవచ్చని పేర్కొంది. వ్యభిచారపు పని కేసులో ఓ ఇంట్లో అరెస్ట్ అయిన మహిళను విడుదల చేస్తూ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బహిరంగ ప్రదేశాల్లో ఆ పని చేస్తే నేరమని తెలిపింది. స్వేచ్ఛగా తిరగడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్క అని స్పష్టం చేసింది. సదరు మహిళను విడుదల చేస్తూ ఆమె సంరక్షణ కోసం ఏడాది పాటు ఇంట్లో ఉంచాలంటూ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.