ఇంటి ముందు నిలిపి ఉంచిన బుల్లెట్ ఉదయానికి మాయమైన సంఘటనపై తెనాలి టూ టౌన్ పోలీ సులు కేసు నమోదు చేశారు. పోలీసుల తెలిపిన వివరణ మేరకు తెనాలి పట్టణంలోని జయ ప్రకాష్ నగర్ కు చెందిన శ్రీనివాసరావు ఆదివారం రాత్రి తన బుల్లెట్ ను ఇంటి ముందు నిలిపి ఉంచాడు. సోమవారం ఉదయానికి వాహనం మాయం కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించటంతో కేసు నమోదు చేశారు.