ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడుపునొప్పి భరించలేక మహిళ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 23, 2023, 11:52 AM

కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం, మునగపాడు గ్రామానికి చెందిన ఇరపనేని నాగలక్ష్మి (21) అనే మహిళా గత నెల రోజుల నుండి కడుపునొప్పితో బాధపడుతూ మందులు వాడుతుంది. ఇటీవల కాలంలో కడుపునొప్పి అధికమై బాధ భరించలేక 19 వ తేదీ ఉదయం 11. 00 కు ఇంట్లో ఎవరు లేని సమయంలో డ్రింక్ లో పురుగుమందు కలుపుకొని తాగింది. అనంతరం తాగిన మందు వాంతి చేసుకుంటుండగా గమనించిన బంధువులు మెరుగైన చికిత్స కొరకు ఆమెను నరసరావుపేట వివేకానంద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 20వ తేదీ మధ్యాహ్నం చికిత్స పొందుతూ నాగలక్ష్మి మృతి చెందింది. మృతురాలి తండ్రి సాకే లింగయ్య ఫిర్యాదు మేరకు ఫిరంగిపురం ఎస్సై లక్ష్మీనారాయణ రెడ్డి కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com