మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో గాలివాన భీభత్సానికి షెడ్డు కూలి గాయపడిన సిబ్బంది, కార్మికులకు సీఆర్డీఏ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనరు వివేక్ యాదవ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిడమర్రు ఘటనలో మొత్తం 31 మంది గాయపడగా, వారికి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు.
వీరిలో ఇప్పటికే చాలా మంది డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారని పేర్కొన్నారు. సీఆర్డీఏ సామాజిక విభాగం అధికారులు బాధితుల నివాసాలకు వెళ్లి వారి స్థితిగతులను పరిశీలించారని, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 5 వేలు, మధ్యస్తంగా గాయపడిన వారికి రూ. 7, 500, ఎక్కువగా గాయపడిన వారికి రూ. పది వేల చొప్పున ఆర్థికసాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.