తుళ్ళూరు మండల పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని తుళ్ళూరు మండల జనసేన అధ్యక్షుడు యర్రగోపుల నాగరాజు తుళ్ళూరు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మార్చి 23న ఎన్జీటీ రూ. 8 కోట్లు జరిమానా విధించి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున జేసీబీలతో లారీల ద్వారా అక్రమ ఇసుక రవాణా జరుగతుందని. వారిని అరికట్టాలని కోరారు.