విశాఖ సముద్ర తీరానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సముద్ర తీరానికి ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చిందని మహారాణిపేట పోలీసులకు రాబడిన సమాచారం మేరకు పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని విశాఖలోని కేజిహెచ్ మార్చురీకి తరలించి భద్రపరిచారు. మృతికి ఆచూకీ తెలిసినవారు మహారాణిపేట పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.