ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడదెబ్బకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 23, 2023, 01:44 PM

వడదెబ్బకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేసవి తీవ్రత ఎక్కువగా వున్న కారణంగా వడదెబ్బకు గురికాకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని మధురవాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి మంగళవారం డాIIప్రశాంతి సూచించారు. సందర్బంగా డా. ప్రశాంతి మాట్లాడుతూ ఈ సంవత్సరం వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా వున్న కారణంగా ప్రజలు జాగ్రత్తగా వుండాలని, వీలైనంతవరకు 11గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళ్లవద్దని, తప్పనిసరయితే తలగుడ్డ లేదా టోపీ కానీ వాడాలని, వెంట మంచినీటి సీసాను తీసుకెళ్లాలని సూచించారు. అలాగే ఆశా కార్యకర్త ద్వారా గాని, ఏ ఎన్ ఎం ద్వారా గాని, అంగన్ వాడీ కార్యకర్త దగ్గర గానీ ఓ ఆర్ ఎస్ పాకెట్స్ తీసుకుని ఒక్కో ప్యాకెట్ ఒక లీటర్ కాచి చల్లార్చిన నీళ్లలో కలిపి సద్ది పడకుండా తాగాలని సూచించారు. 60 సంIIదాటిన వృద్దులు, గర్భిణీ స్త్రీలు , మరియు 5 సంIIల లోపు వయసు కలిగిన పిల్లల విషయంలో మరింత జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఏ ఎన్ ఎం లు దగ్గర, ఆశ వర్కర్లు దగ్గర అందుబాటులో వుంచామని తెలిపారు. ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే బాగా గాలి తగిలే ప్రదేశంలో విశ్రాంతిగా సేదతీరనిచ్చి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com