అప్రకటిత పవర్ కట్లు, విద్యుత్ చార్జీల బాదుడుతో వినియోగదారులు బెంబేలెత్తిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపుమేరకు భీమిలి జోన్లో ఉన్న 1, 2, 3, 4 వార్డులు మరియు భీమిలి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కృష్ణాకోలనీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా గంటా నూకరాజు మాట్లాడుతూ సామాన్యప్రజల నడ్డివిరచడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఎన్నడూ లేనివిధంగా కరెంటు చార్జీలు పెరిగాయని, వినియోగదారులపై 57 వేల కోట్ల రూపాయలు బాదుడుకి శ్రీకారం చుట్టిన ఘనత జగన్ రెడ్డికే చెల్లిందని అన్నారు.
ఇన్ని రకాలుగా ప్రజలను వేదిస్తున్నా ఇంకా సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేసారు. నిత్యావసర వస్తువుల ధరలు ఒకపక్క, విద్యుత్, గ్యాస్ ధరలు మరోపక్క, సామాన్య ప్రజల వేధింపులు ఇంకోపక్కతో ప్రజలు విలవిలలాడుతుంటే మా నమ్మకం నువ్వే జగన్ అనడానికి సిగ్గులేదా.? అని గంటా నూకరాజు ప్రశ్నించారు. ఒకసారి తరపాలు లేకుండా ప్రజలమధ్యకు వస్తే ప్రజల కష్టాలు తెలిసి ఉండేవని అన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగురైతు సంఘం ప్రధాన కార్యదర్శి డి. ఎ. ఎన్. రాజు మాట్లాడుతూ వ్యవసాయ మోటర్లకు విద్యుత్ డిజిటల్ మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడ్లు వేశారని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎన్నడూ ఏ రైతు అనుభవించలేదని అన్నారు. ఇదేమి కర్మ ఈ రాష్ట్ర రైతులకని మండిపడ్డారు. నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వరు, నాన్యమైన విత్తనాలు ఇవ్వరు, ఇదీ కాకుండా పర్యటనలకు వెళ్లిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు రైతులపై సిటార్లు వేస్తారని అన్నారు. ఒకటవ వార్డు అధ్యక్షులు తమ్మిన సూరిబాబు మాట్లాడుతూ సిబిఐ కేసులు, బాబాయ్ హత్య కేసులు తప్ప ఈ ముఖ్యమంత్రికి ప్రజల గోడు వినబడదని అన్నారు. కరెంటే సరీగా ఇవ్వని ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడంలో మాత్రం ఎక్కడా తగ్గేదిలే అన్నట్లు ఉందని అన్నారు. 2వ వార్డు నాయకులు చోడిపల్లి సాయి మాట్లాడుతూ వేలకోట్ల రూపాయలు బకాయి మోపిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే చెల్లిందని అన్నారు. 4వ వార్డు అధ్యక్షులు పాసి నర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత నవ్యంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవిని చేపట్టిన తరువాత 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశారని అన్నారు.
మాజీ జెడ్పిటిసి శరగడ అప్పారావు మాట్లాడుతూ రైతుల కన్నీరుకు కారణమైన ఇలాంటి నీచమైన ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జి రాజు, గరికిన కింగ్, కారి అప్పారావు, వాసుపల్లి పోలమ్మ, కోరాడ రమణ, పతివాడ రాంబాబు, గొలగాని నరేంద్ర కుమార్, కనకల అప్పలనాయుడు, మారోజు సంజీవకుమార్, కొక్కిరి అప్పన్న, వాడమొదలు సత్యారావు, కంచెర్ల కామేష్, గండిబోయిన పోలిరాజు, బోని రమణ, సూరాడ అమర్ నాద్, సింగంపల్లి అమ్మోరు, కంభపు శివ, తమ్మిన రాము, వియ్యపు పోతురాజు, పిల్లా తాతారావు, తెడ్డు సింహాద్రి, వాడమొదలు తవుడయ్య, మట్టా దాసు తదితరులు పాల్గొన్నారు.