గొలుగొండ మండలం దారమటం సమీపంలోని పాత మల్లంపేట రెవిన్యూ పరిధిలో సుమారు 80 ఎకరాలలో టేకు తోటలో నాలుగు రోజుల క్రితం పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కొంతమంది, రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు ఏకమై ఈ తోటలోని విలువైన 9 టేకు చెట్లను నరికి తరలించడానికి ప్రయత్నం చేశారు. అనుకూల సమయం చూసుకొని వీటిని పట్టణ ప్రాంతాలకు తరలించేందుకు రహస్య ప్రదేశానికి తరలించారు. హైదరాబాద్ కు చెందిన తోట యజమాని ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగినా ఫారెస్ట్ అధికారులు గుర్తు తెలియని వ్యక్తులు నరికినట్లుగా తెలిపారు. అక్రమంగా దాసి వుంచిన టేకు కలపను గొలుగొండ డిపోకు సోమవారం రాత్రి తరలించారు. పట్టుకున్న కలప విలువ అంచనా వేస్తామని అడివి సెక్షన్ అధికారి లక్ష్మణ్ తెలిపారు.