అల్లూరి జిల్లా కొయ్యురు మండలం డౌనూరు పంచాయతీ తులబడ గ్రామం లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధి పని ప్రదేశంలోనే నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే గతము కంటే బడ్జెట్లో నిధులు తగ్గించారని విమర్శించారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ నిధులను భవనాలు, రోడ్లు, కు ఉపయోగిస్తున్నారని దీనివలన ఆ పని యంత్రాలతో చేయవలసి వస్తుందని దీంతో ఉపాధి కార్మికుల పని దినాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో కార్మికులకు 200 రోజులు పని దినాలు కల్పించాలని, కనీస వేతనాలు రూ. 600 రూపాయలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ రూ. 20 లక్షల వరకు ఇవ్వాలని, పనిముట్లు ఇవ్వాలని, పనిచేసే చోట నీడ కోసం టెంట్ వెయ్యాలని, మంచినీరు ఏర్పాటు చేయాలని ప్రాథమిక వైద్యం కోసం మెడికల్ కిట్టు ఏర్పాటు చేయాలని, వారానికి ప్లేసిప్పులు ఇవ్వాలని, పనిని పాత పద్ధతిలో చేయించాలని, జాబ్ కార్డు ఉన్నవారికి వెంటనే పని కల్పించాలని, అర్హులైన వారందరికీ జాబ్ కార్డులు కొత్తవి చేసి ఇవ్వాలని, బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. మేట్ చేసేవారికి స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని, కనీస వేతనం రూ. 10 వేలు రూపాయలు చెల్లించాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాంబేలు చిట్టిబాబు, పిలుపు, వార్డు మెంబర్ బంగారమ్మ, అంపురి బుజ్జిబాబు, లక్ష్మి, జాన్, వంతల అప్పారావు, జోసఫ్, పౌల్, రిభిక తదితరులు పాల్గొన్నారు.