తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్పసముద్రం మండలంలో కరెంట్ షాక్ కొట్టి సర్పంచ్ దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు. మండలంలోని కుర్రా వాండ్లపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ సర్పంచ్ కొండా బాబు రెడ్డి (50) మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలం దగ్గరకు బోరు మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. స్టార్టర్ ఆన్ చేయగానే కరెంట్ షాక్ కొట్టి తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు.