ముందస్తు బెయిలు కోరుతూ ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈనెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు సూచించింది. అవినాష్ పిటిషన్‌పై విచారణ జరిపి తుది తీర్పు వెల్లడించాలని హైకోర్టుకు సుప్రీం తెలిపింది. దీంతో అవినాష్‌కు ఊరటనిచ్చే విషయమని చెప్పవచ్చు. కానీ సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.