ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అపూర్వ ఘట్టానికి నాలుగేళ్లు పూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 23, 2023, 03:08 PM

నయవంచన పాలనకు చరమగీతం పాడి, సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టి 175 స్థానాలకు గాను 151 యొక్క స్థానాలు సాధించిన చారిత్రాత్మక ఘట్టానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు నిరంకుశ అవినీతి పాలనను కూకటి వేళ్ళతో పెకిలించి, రాజన్న రాజ్య స్థాపనకు విజయదుందుభి మోగిస్తూ ఫలితాలు వెలువడిన సందర్భంగా శాసనసభ్యులు పార్ధసారధి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే 175/151 స్థానాలు సాధించి చరిత్ర సృష్టించి దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జైజైలు పలుకుతున్నారని మరొకసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఉవ్విల్లురుతున్నారు అని అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో తనను గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యులు పార్ధసారధి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com