కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి పోర్టు నిర్మించాలని చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి రాగానే పనులు మొదలుపెట్టాలి. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న ఆరు నెలల ముందు పోర్టు నిర్మాణం సాధ్యమా, చెల్లికి మళ్లీ పెళ్లి అన్నట్టుగా మూడోసారి శంకుస్థాపన చేశారని విమర్శలు చేశారు. చిత్తశుద్ధిలేదని ప్రజలు వైఎస్ఆర్ పార్టీని విశ్వసించడం లేదని అమలు కాని వాగ్దానాలు చేయుట విడ్డూరంగా ఉందని బండి రామకృష్ణ ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. పూర్తిస్థాయిలో వైద్యులను నియమించి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని, గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, రోడ్ల నిర్మాణం పట్ల దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడ్డం రాజు, గల్లా తిమోతి, వంపు గడవల చౌదరి, మహమ్మద్ సమీర్, దాదా, పినిశెట్టి వేణు, చిట్టూరి శివ ప్రసాద్, త్రిపురారి తరుణ్, ఈవనమణిబాబు, దేవర వీరబాబు, లంకె శ్రీనివాస్, ఉడుముల బుజ్జి, కొండా మేస్త్రి , తోట భాస్కర్, శాయనశివ, బీరం సుదర్శన్, తోట రాజేష్, రామ్ జ్యోతి, గరికపాటి వెంకట్రావు, కరుణాకర్, పినిశెట్టి కుమారి, అడపయశ్వంత్, తిరుమలశెట్టి నాగరాజు, ముళ్ళపూడి సుబ్బారావు, యాదర శ్రీనివాస్, జనసేన పార్టీ మండల పట్టణ నాయకులు జన సైనికులు పాల్గొన్నారు.