దేశ ఆర్థిక రాజధాని ముంబై పోలీసు శాఖకు తాజాగా రెండు బెదిరింపులు వచ్చాయి. ముంబైలో బాంబు బ్లాస్ట్ చేయనున్నట్లు ఓ వ్యక్తి పోలీస్ శాఖకు ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేయగా.. మరో వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి 26\11 తరహాలో ఉగ్రదాడులకు పాల్పడుతామంటూ పూర్తిగా మాట్లాడకుండానే ఫోన్ కట్ చేశాడు. దీంతో ముంబై పోలీసు శాఖ అప్రమత్తమైంది. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.