ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు విజయనగరం డీఈ ఓ బి. లింగేశ్వరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీలకు సంబంధించి ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ప్రధానోపాధ్యాయులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 25 నుంచి 27 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. 28 నుంచి సీనియారిటీ లిస్టును వెల్లడిస్తామన్నారు. 30 నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్ 2 నుంచి ఫైనల్ సీనియారిటీ లిస్టు వెబ్సైట్ లో పెడతామని పేర్కొన్నారు. జూన్ 4న ఖాళీల లిస్టును వెల్లడిస్తామని, జీరో సర్వీస్ కలిగిన ఉపాధ్యాయులు కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కింద దరఖాస్తు చేసు కోవచ్చన్నారు. ఇతర వివరాలకు సీఎస్ఈ వెబ్సైట్ సంప్రదించాలని కోరారు.