విజయనగరం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్ల బదిలీ కౌన్సెలింగ్ ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎం. దీపిక మంగళవారం నిర్వహించారు. ఒకే స్టేషన్ లో ఐదేళ్లు విధులు పూర్తిచేసుకున్న ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్లను వారి వయసు ప్రాధాన్యత ఆధారంగా జాబితా తయారు చేసి కౌన్సెలింగ్ కు ఆహ్వానించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో ఏర్పడిన ఖాళీలను స్క్రీన్ మీద చూపుతూ వారు కోరుకున్న స్టేషన్ కు ఎలాంటి సిఫార్సులు లేకుండా బదిలీ చేశారు. 8 మంది ఏఎస్ఐలు, 16 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 76 మంది పోలీస్ కానిస్టేబుళ్లను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏఎస్పీ అస్మా ఫర్హీన్ పాల్గొన్నారు.