ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భారత్లో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ బుధవారం కలిశారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.