ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే రూపొందించిన దయనీయ సూచీ 2022లో భారతదేశం 103వ స్థానంలో నిలిచింది. భారత్‌లో నిరుద్యోగ సమస్య వల్లే ఈ స్థానం కల్పించినట్టు వెల్లడించారు. ఇక ఈ సూచీలో ఆఫ్రికా దేశం జింబాబ్వే మొదటి స్థానంలో ఉంది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా 134వ స్థానంలో నిలిచింది. అమెరికన్ల సంతోషాన్ని నిరుద్యోగం ఆవిరి చేస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. అంటే భారత్ కంటే కేవలం ఆరు స్థానాలు మెరుగ్గా ఉంది.