లాజిస్టిక్స్ ఖర్చును GDPలో 9శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గఢ్కరీ తెలిపారు. ప్రస్తుతం లాజిస్టిక్స్ ఖర్చు GDPలో 14శాతం నుంచి 16శాతం వరకు ఉందన్నారు. రాబోయే మూడేళ్లలో దానిని తగ్గిస్తామన్నారు. భారత్ నుంచి ఎగుమతులు పెరిగితే లాజిస్టిక్స్ ఖర్చు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. పోటీతత్వాన్ని పెంచడానికి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని తీసుకువచ్చామని చెప్పారు.