సత్తెనపల్లిలోని సరకు రవాణా కార్యాలయం, పలు విత్తనాల దుకాణాల్లో బుధవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనుమతి పత్రాలు లేని పురుగు మందుల నిల్వలను గుర్తించారు. రూ. 2. 52 లక్షల విలువైన 240 లీటర్ల గ్లైసెల్, రూ. 2 లక్షల విలువైన 100 కిలోల ఆమ్మోనియం సాల్ట్, రూ. 30 వేల విలువైన బయో ఫెస్టిసైడ్స్ సీజ్ చేశారు. మొత్తం విలువ రూ. 4. 82 లక్షలు ఉంటుందని తెలిపారు.