పెదనందిపాడు మండలం పుసులూరులో వై. కోటేశ్వరమ్మ ఇంటి వద్ద దక్షిణం వైపునున్న మాసనం నాగేశ్వరరావు గోడ నిర్మిస్తున్నారు. వివాదం కోర్టులో ఉన్నందున గోడ ఇక్కడ ఎందుకు కడుతున్నారని కోటేశ్వరమ్మ ప్రశ్నించింది. అందుకు ఆమెను నాగేశ్వరరావు భార్య, కుమారుడు, మరొకరు జుట్టు పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించి కర్రలతో కొట్టారని, అడ్డు వచ్చిన తన భర్తను కూడా కొట్టారని బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.