సంబంధిత శాఖల అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పొన్నూరు చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో యదేచ్చగా మట్టి తవ్వకాలు జరిపి పెద్దపెద్ద లారీల్లో తరలిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి మట్టి మాఫియా లారీల్లో తరలిస్తున్న పోలీసు, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపి మట్టి వ్యాపారులు వేల రూపాయల్లో మట్టిని అమ్ముకుంటూ తమ జేబులు నింపుకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని తరలించటం చట్టరీత్యా నేరం. దీంతో ప్రభుత్వా ఆదాయానికి భారీ గండి పడుతుంది. ఇప్పటికైనా అధికారులు మట్టి మాఫియా ను కట్టడి చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆరోపిస్తున్నారు.