ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో నేడు భేటీ కానున్నారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రజల వద్దకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు.