పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నుంచి సీనియర్ నేతలందరూ ఒకరి తర్వాత ఒకరుగా తప్పుకోవడంపై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు పార్టీని నిర్వీర్యం చేసేందుకు తమ నేతలపై ప్రభుత్వం, ఆర్మీ ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయిస్తున్నాయని ఇమ్రాన్ ఆరోపించారు. అయితే మాజీ మంత్రి ఫవాద్ చౌదరీ పీటీఐ పార్టీకి రాజీనామా చేశారు.