గంగాధరనెల్లూరు మండల పరిధిలోని తూగుండ్రం సచివాలయ పరి ధిలోని గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని మండల పార్టీ కన్వీనర్ పూర్ణచంద్రారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం తూగుండ్రం నుంచి కార్యక్రమం సాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని గడప గడపకు వెళ్లి ప్రభుత్వంఅందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి గురించి ప్రజలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ప్రజాప్రతిని ధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.