గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం నుంచి కారంపూడిలో ప్రారంభించనున్నట్లు ఎంపీడీఓ జి. శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గురువారం సాయంత్రం పల్నాటి ప్రజల ఇలవేల్పు వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ పీఆర్కే ప్రారంభిస్తారని తెలిపారు.