2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లోప్రవేశాలకు ఆన్ లైన్లో దర ఖాస్తులు స్వీకరిస్తున్నట్టు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎం. గోపాలకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఎన్ని ఐటీఐలకైనా, ఏ జిల్లాలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అభ్యర్థి యూనిక్ సంఖ్యతో కూడిన ప్రింట్ ను తీసుకుని ప్రవేశ సమయంలో అందజేయాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 6 వరకు ఐటీఐ. ఏపీ. జీవోవి. ఐఎన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.