చిన్నతనం నుండే చదువులలో పోటీతత్వం ఉండాలని గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు అన్నారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా గురువారం లావేరు మండలం మురపాక శాఖా గ్రంథాలయంలో క్విజ్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులు ఇచ్చి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువుతోపాటు ఆటపాటల్లో కూడా పోటీ తత్వం ఉండాలన్నారు. జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన పుస్తకాలు గ్రంథాలయంలో ఉన్నాయనివాటిని విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. అలాగే చిన్నారులకు బాల సాహిత్యం పుస్తకాలు కూడాఅందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సహాయకులకు పి. షణ్ముఖరావు, విద్యార్థులు పాఠకులు, పాల్గొన్నారు.