వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అమలులో భాగంగా దళారీ వ్యవస్థకు పూర్తిస్థాయిలో స్వస్తి పలకడం జరిగిందని యువనేత ధర్మాన రామ మనోహర్ నాయుడు అన్నారు. గురువారం గార మండలం గోంటి పంచాయితీ దీపావళి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు ప్రజలవద్ధకు వెళ్లి, సంక్షేమ పథకాలు వస్తున్నాయా, వాలెంటీర్స్ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది ఇంటి ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు యొక్క వివరాలు తెలియజేస్తున్నారా అని గ్రామస్థులుకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి అమలైన పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలతో మమేకమై కలిసి మాట్లాడి గత ప్రభుత్వముకు మరియు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరించి, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యవర్తి లేకుండా, లంచాలు లేకుండా, అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు, మరియు తదితరులు పాల్గొన్నారు.