ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రతి ఏటా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ 30 నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం లక్షల మంది భక్తులు తరలివస్తారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రథయాత్రలో భాగంగా జగన్నాథుడు ఏడాదికోసారి ప్రసిద్ధి గుండిచా మాత ఆలయాన్ని సందర్శిస్తాడు. దేశంలో జరిగే గొప్ప ఉత్సవాల్లో ఇది ఒకటి.