టిడిపికి ఊపిరినిచ్చేలా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 110వ రోజు కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో జన నీరాజనాల నడుమ ముందుకు సాగింది. అడుగడుగునా ప్రజలు లోకేశ్ ఎదురేగి ఆత్మీయ స్వాగతం పలుకుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. పెద్దముడియం గ్రామ ప్రజలు, పెద్ద పసుపుల దళితులు, పెద్ద పసుపుల గ్రామస్తులు, జమ్మలమడుగు మైనారిటీలు లోకేశ్ ను కలిసి మాట్లాడారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చి లోకేశ్ ముందుకు సాగారు.