గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఉంటుందని తెలిపారు. రెండేళ్లు పూర్తయి, ప్రొబేషన్ డిక్లేర్ అయిన వారు బదిలీలకు అర్హులని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. పనిచేస్తున్న జిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం ఉందని వివరించారు. అంతర్ జిల్లాల బదిలీల్లో స్పౌస్, మ్యూచువల్ బదిలీలకు వీలుందని తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు