ఆప్ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ పరిస్థితి గురువారం విషమించడంతో ఆక్సిజన్ సపోర్టుపై ఉంచి ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించినట్లు పార్టీ తెలిపింది. జైన్‌ను మొదట దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్చారని, ఆ తర్వాత శ్వాసకోశ సమస్యల కారణంగా లోక్ నాయక్ జై ప్రకాష్ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రికి తరలించారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. గత ఏడాది మేలో మనీలాండరింగ్ కేసులో జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినప్పటి నుంచి జైలులో ఉన్నారు. తీహార్ జైలులోని బాత్‌రూమ్‌లో తల తిరగడంతో కుప్పకూలిపోయాడు. ఇంతకు ముందు కూడా సత్యేందర్ జైన్ బాత్‌రూమ్‌లో పడి వెన్నెముకకు తీవ్ర గాయమైంది" అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది.