సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ నేడు ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందికి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మందికి పట్టాలు పంపిణీ చేస్తారు. వీటితోపాటు, సీఆర్డీఏ ప్రాంతంలో నిర్మించిన 5,024 టిడ్కో గృహాలనూ లబ్ధిదారులకు సీఎం అందజేయనున్నారు.