నాణ్యమైన విద్య ప్రభుత్వ కళాశాలలోనే సాధ్యం అవుతుందని 49 కొత్తపల్లి మిట్ట బాలికల జూనియర్ కళాశాల హెచ్ఎం బండి లలితకుమారి అన్నారు. ఈ సందర్భంగా ఎస్. ఆర్. పురం మండలంలోని 49 వ కొత్తపల్లిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బాలికల జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయడం జరిగిందన్నారు.
కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులుతో కలిసి గ్రామాల్లో తిరిగి ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులను చేర్పించాలన్నారు. ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలుతో క్రమశిక్షణ, సామాజిక స్పృహ, స్వీయ అభ్యసనకు అధిక ప్రాధాన్యత కల్పించి మెరుగైన విద్యను అందించడం జరుగుతుం దన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాలు పాల్గొన్నారు.