దేశంలో గుండెపోటు మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌కు చెందిన బాడీ బిల్డర్, మాజీ మిస్టర్ ఇండియా ప్రేమ్ రాజ్ (42) గుండెపోటుతో మరణించారు. ఉదయం వర్క్ ఔట్స్ చేసుకుని వాష్ రూమ్‌కు వెళ్లిన ఆయన ఎంతసేపటికీ బయటకి రాలేదు. కుటుంబికులు బాత్ రూమ్ డోర్ బద్దలు కొట్టి చూడగాప్రేమ్ రాజ్ అపస్మారక స్థితిలోకి పడి ఉన్నట్లు గుర్తించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు