తమిళాడు మంత్రి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ ఏకధాటిగా సోదాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు రైడ్స్ జరుపుతున్నారు. చెన్నై, కొయంబత్తూరు, కరూర్ జిల్లాల్లో మంత్రి నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు సోదాలు నిర్వహించి సంబంధిత పత్రాలను పరిశీలిస్తున్నారు.