అసోం గువాహటిలోని ఖార్గులీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం నీటి పైప్ లైన్ పేలిన ఘటనలో సుమిత్రా రాభా అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 19 మందికి గాయాలయ్యాయి. 50 ఇళ్లు ధ్వంసమైనట్లు స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఉన్న 300 మంది ఈ ఘటనతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa