తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న చేజర్లకు సాగర్ నీటితో బేతంరాజు చెరువును నింపేందుకు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 3. 47 కోట్లు కేటాయించిందని, ఇది పూర్తయితే ఏడాదంతా తాగునీటితోపాటు 197 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తా మన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ బి. సాంబశి వరెడ్డి, జి. నాగభూషణరెడ్డి, వైసిపి మండల కన్వీనర్ బి. రాఘవరెడ్డి, మండల ఉపాధ్య క్షులు ఎం. ప్రవీణ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.