కేంద్రమంత్రి రాజ్‌కుమార్ రంజన్.. మణిపూర్ నివాసంపై దాడి జరిగింది. దాడులకు పాల్పడిన వారు నివాసంలోకి ప్రవేశించేందుకు తెగ కష్టపడినట్లు సమాచారం. ‘‘వారంతా ఇంటిని దగ్దం చేయాలని పక్కా ప్లాన్ వచ్చినట్లు ఉన్నారు. వారంతా బిష్నుపుర్లో మెయిటీ వర్గం వ్యక్తి మరణించడంపై కోపంగా ఉన్నారు’’అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారని అధికారులు చెప్పారు. అయితే తన నివాసంపై దాడి రాజకీయంగా ప్రభావితం చేయబడిందని రంజన్ ఆరోపించారు.