అమరావతి ఇక నుంచి సామాజిక అమరావతి అవుతుందని ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.7 లక్షల నుంచి రూ.10లక్షలు విలువ చేసే ఇంటి స్థలంను లబ్ధిదారులకు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఇవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదని, సామాజిక న్యాయ పత్రాలని సీఎం జగన్ అభివర్ణించారు. సొంతంగా ఇళ్లు కట్టుకునే వారికి రూ.లక్షా 80వేలు అకౌంట్లో వేస్తామని జగన్ చెప్పారు.