రష్యాతో సరికొత్త ఒప్పందం చేసుకున్నట్లు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెన్కో ప్రకటించారు. ఈ ఒప్పందం రష్యా తన టాక్టికల్, షార్ట్-రేంజ్ అణ్వాయుధాలను బెలారస్‌కు రవాణా చేయడానికి అనుమతిస్తుందని తెలిపారు. ‘‘ఈ ఒప్పందంపై పుతిన్ సంతకం చేసే సమయానికే ఆయుధ రవాణా జరుగుతోంది. ఇది రష్యా తన ఆయుధాలను బెలారస్‌లోని ప్రత్యేక స్థావరాల్లో స్టోర్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది’’ అని తెలిపారు.