బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యంపై నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారని పేర్కొన్నారు. 80కోట్ల మంది భారత ప్రజలకు బీజేపీ విషమిస్తోందని ఆయన అన్నారు. ‘‘నీతి అయోగ్ పరిశోధకులు తెలిపిన దాని ప్రకారం.. ఫోర్టిఫైడ్ బియ్యం హైపర్టెన్షన్, డయాబెటీస్ ఉన్న వారికి ప్రమాదకరం. ఎటువంటి మార్గదర్శకాలు లేకుండానే బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు’’అని తెలిపారు.