వైఎస్ వివేకా హత్య విషయం సీఎం జగన్కు ముందే తెలుసని సీబీఐ పేర్కొంది. వివేకా మృతి విషయం జగన్ కు ఉదయం 6.15 గంటలకు ముందే తెలుసని, కృష్ణా రెడ్డి చెప్పకముందే ఈ విషయం జగన్ కు తెలుసని సీబీఐ అనుబంధ కౌంటర్ లో తెలిపింది. దీనిపై సీఎం తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ అఫిడవిట్ వెనుక కుట్ర దాగి ఉందని, న్యాయపోరాటానికి సీఎం తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారని సమాచారం.