రాజమండ్రిలో నేటి నుండి రెండు రోజులపాటు టీడీపీ మహానాడు జరగనుంది. నేడు 15 వేల మంది ప్రతినిధులు, 35 వేల మంది కార్యకర్తలతో సభ నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 15 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికోసం టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాగా, మహానాడు వేదికగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేసే అవకాశం ఉంది.