రాబోయే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. గ్రీన్‌హౌస్ గ్యాస్, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండిపోనున్నాయని తెలిపింది. 2023-27 మధ్యకాలంలో సగటు ఉష్ణోగ్రతల్లో 1.5 డిగ్రీల పెరుగుదల ఉంటుందని పేర్కొంది. అయితే రాబోయే ఈ ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.