ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లె మండలం అనంతవరంలో లారీ అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, లారీ నాపరాళ్ల లోడుతో మాచర్ల నుండి రేపల్లెకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.