రాజస్థాన్‌లో ఒకే వేదికపై 2,200 జంటలు ఒక్కటయ్యాయి. బారాన్ జిల్లాలోని బట్వాడ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ ఆచారాల ప్రకారం 2,111 జంటలు ఏడడుగులు నడిచాయి. ముస్లిం సంప్రదాయం ప్రకారం.. 111 మంది జంటలు నిఖా జరుపుకొన్నాయి. కులమతాలకు అతీతంగా, ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో పాటు మంత్రి ప్రమోద్ జైన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.